విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: బెడ్‌పై నుండి పడి బాలింత స్వాతి మృతి

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 28, Aug 2018, 4:23 PM IST
vijayawada govt.hospital death of woman after delivery to fall on bed
Highlights

 ప్రభుత్వఆస్పత్రుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్య సేవలందుతున్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. ప్రజాప్రతినిధులు సైతం ఆపరేషన్లు చేయించుకుని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం భేష్ అని చెప్తున్నారు. ప్రచారానికి ఆస్పత్రిలో పరిస్థితులకు సంబంధం లేదని అనేక చోట్ల రుజువు అవుతుంది. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో ఓ బాలింత మృతి అందుకు నిదర్శనం

విజయవాడ:  ప్రభుత్వఆస్పత్రుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్య సేవలందుతున్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. ప్రజాప్రతినిధులు సైతం ఆపరేషన్లు చేయించుకుని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం భేష్ అని చెప్తున్నారు. ప్రచారానికి ఆస్పత్రిలో పరిస్థితులకు సంబంధం లేదని అనేక చోట్ల రుజువు అవుతుంది. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో ఓ బాలింత మృతి అందుకు నిదర్శనం. 

విజయవాడ పాతప్రభుత్వ తల్లీ పిల్లల ఆస్పత్రిలో కొత్తపేటకు చెందిన పి స్వాతి అనే మహిళ బెడ్ మీద నుంచి కింద పడి దుర్మరణం చెందింది. ఆస్పత్రిలో బెడ్ ల కొరత ఉండటంతో వైద్యులు ఒకే మంచంపై ఎక్కువ మంది గర్భిణీలు, బాలింతలను ఉంచుతున్నారు. స్వాతి ఉంటున్న బెడ్ పై ఆమెతోపాటు నలుగురు బాలింతలు ఉన్నారు. ఎక్కువ మంది ఉండటంతో ప్రమాదవశాత్తు స్వాతి  కింద పడి మృతి చెందింది. మృతురాలు స్వాతి సోమవారం ఓ శిశువుకు జన్మనిచ్చింది.

తన ఆరోగ్యం బాగోలేదని తనకు సహాయంగా ఒకరిని ఉంచాలని స్వాతి ప్రాధేయపడినా...సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. స్వాతి బెడ్ పై నుంచి కిందపడి విలవిలా కొట్టుకుంటున్నా ముక్కు నుంచి రక్తం కారుతున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్వాతి మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు. 

బాధితులకు సీపీఎం నేతలు మద్దతు పలికారు. మృతురాలు కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ధర్నా నిర్వహించారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  


మరోవైపు నందిగామప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగి పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మానవత్వం మరచి కాళ్లుచేతులు పనిచేయని ఓ రోగి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బెడ్ సౌకర్యం కల్పించకుండా బెడ్ లేదని పంపేశారు. బెడ్ ఇవ్వాలంటూ ఎంత బ్రతిమిలాడినా బెడ్ లేదని వీల్ చైర్ ఇచ్చి బయటకు పంపేశారు. దీంతో ఆగ్రహం చెందిన రోగి బంధువులు సిబ్బది తీరును నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  

 

loader