విజయవాడ: విజయవాడలోని దుర్గగుడి ఈవో సురేష్ బాబుకు కరోనా సోకింది. ఆలయంలో 18 మందికి కరోనా నిర్ధారణ అయినట్టుగా అధికారులు ప్రకటించారు 

విజయవాడలోని దుర్గమ్మ భక్తులకు కోవిడ్ నిబంధనల ప్రకారంగా దర్శనం కల్పిస్తున్నారు. అయితే దుర్గగుడి ఈవో సురేష్ బాబుకు కరోనా సోకినట్టుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆలయంలోని 18  మందికి కూడ కరోనా సోకింది.
ఇప్పటికే ఇదే ఆలయంలో పనిచేసిన ఒకరు కరోనాతో మరణించారు. 

తిరుమలలో కూడ కరోనాకేసులు పెరిగాయి. కరోనాతో టీటీడీ అర్చకులు శ్రీనివాసాచార్యులు గురువారం నాడు మరణించాడు. గతంలోనే మాజీ టీటీడీ ప్రధాన అర్చకుడు కూడ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. 

కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 9042 కరోనా కేసులు  రికార్డయ్యాయి. గురువారంనాటికి రాష్ట్రంలో 1,96,789కి కరోనా కేసులు చేరాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1753 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల 99వేల 332 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. రాష్ట్రంలో 82,166 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.