విజయవాడ బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసులో అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షల పిటిషన్‌పై వాదనలను కోర్ట్ ఎల్లుండికి వాయిదా వేసింది. అనుమానితులకు నార్కో పరీక్షలు చేసేందుకు సీబీఐ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నార్కో అనాలసిస్ పరీక్షల పిటిషన్‌పై వాదనలను కోర్ట్ ఎల్లుండికి వాయిదా వేసింది. అనుమానితులకు నార్కో పరీక్షలు చేసేందుకు సీబీఐ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం .. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయేషా మీరా హత్య జరిగి సుమారు 12 ఏళ్లు అవుతోంది. ఉమ్మడి ఏపీలో 2007 డిసెంబర్ 27వ తేదీన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో అయేషా మీరా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సత్యంబాబును దోషిగా గుర్తించి పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో సత్యం బాబు దోషి కాదని హైకోర్టు తేల్చడంతో అతను జైలు నుండి విడుదలయ్యారు. 

సత్యంబాబు కూడా జైలు నుండి విడుదల కావడంతో అసలు దోషులు ఎవరనే విషయమై తేల్చేందుకు ఈ కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. సీబీఐ అధికారులు ఈ కేసును మొదటి నుండి విచారణ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయేషా మీరా మృతదేహానికి 2020 ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు