Asianet News TeluguAsianet News Telugu

ఆయేషా కేసు: సిట్‌కు కోర్టులో చుక్కెదురు, నార్కోఅనాలిసిస్ టెస్ట్‌కు నో

నార్కో అనాలిసిస్ టెస్ట్ కు కోర్టు నో

Vijayawada Court dismisses SIT petition for narco analysis test


హైదరాబాద్: ఆయేషా మీరా కేసులో సిట్‌కు శుక్రవారం నాడు కోర్టులో చుక్కెదురైంది. నిందితులుగా అనుమానాలున్న వారికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను విజయవాడ నాలుగవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  కొట్టివేశారు.

ఆయేషా మీరా కేసును ఏపీ ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది.  అయితే ఈ కేసును విచారణ చేసేందుకు గాను ప్రత్యేక విచారణ టీమ్ ను కూడ ఏర్పాటు చేసింది.  ఈ కేసులో సుమారు ఏడుగురు అనుమానితులకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని సిట్ భావించింది. 

ఈ మేరకు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  శుక్రవారం నాడు   విచారణ జరిపిన విజయవాడ  నాలుగవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  కోర్టు  ఈ పిటిషన్ ను కొట్టివేసింది.

10 ఏళ్ళ క్రితం  ఆయేషా మీరాను హస్టల్‌లో అత్యంత దారుణంగా  హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో విపక్షంలో టిడిపి ఆందోళన చేసింది.  టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును రీ ఓపెన్ చేసింది. గతంలో ఈ కేసులో నిందితుడిగా రిమాండ్ చేసిన సత్యంబాబు నిర్దోషిగా కోర్టు  ప్రకటించడంతో  ఈ కేసులో అసలు దోషులెవరనేది తేలాల్సిన అవసరం ఏర్పడింది.

 దీంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును రీ ఓపెన్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక  టీమ్ ను కూడ ఏర్పాటు చేసింది.  ఈ కేసులో అనుమానితులుగా  కోనేరు సతీష్ బాబు, అబ్బూరి గణేష్, చింతా పవన్ కుమార్, హస్టల్ వార్డెన్  ఇనంపూడి పద్మ, ఆమె భర్త శివరామకృష్ణ, ఆయేషా రూమ్మేట్స్  కె. కవిత, సౌమ్యలు నార్కో అనాలిసిస్ టెస్ట్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు  ఈ రకమైన టెస్ట్ ల పట్ల తమ భయాలను వ్యక్తం చేశారు. ఈ టెస్ట్‌లు తమకు సమ్మతం కాదన్నారు.

అయితే హస్టల్ వార్డెన్ పద్మ, ఆమె భర్త శివరామకృష్ణ, ఆయేషా రూమ్మేట్  కవితలు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు సంసిద్దతను వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ మేరకు కోర్టులో పిటిషన్ మాత్రం దాఖలు చేయలేదు.ఈ పిటిషన్లపై శుక్రవారం నాడు ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు నార్కో అనాలిసిస్ చేయాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టిపారేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios