ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో వైసిపి ఒంటరిగా పోటీచేస్తుంటే... తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు టిడిపి ఇతర పార్టీలను కలుపుకుపోతుంటే... అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలవేళ రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

విజయవాడ సెంట్రల్ రాజకీయాలు :

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడది ప్రత్యేక స్థానం. విజయవాడ రాజకీయాల ప్రభావం రాష్ట్రం మొత్తంపై వుంటాయన్నది అందరికీ తెలిసిందే. దీంతో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో పట్టుకోసం వైసిపితో పాటు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల బలాబలాలు సరిసమానంగా వున్నాయి. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓసారి టిడిపి, మరోసారి వైసిపి గెలించింది. విశేషం ఏమిటంటే ఇక్కడ ఏ పార్టీ గెలిచిందో రాష్ట్రంలోనూ అదేపార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు ఎవరికి దక్కుతుందో... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరో ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. విజయవాడ అర్బన్ మండలం (విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 14, 20 నుండి 31, 33 నుండి 35, 42 నుండి 44, 49,77,78 వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి) 

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,69,912
పురుషులు - 1,32,576
మహిళలు ‌- 1,37,264

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ నియోజకవర్గానికి మార్చింది వైసిపి అధిష్టానం. సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసిపికి చెందినవాడే అయినా మరోసారి అవకాశం దక్కలేదు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమా వైసిపి చేతిలో ఓడిపోయారు. అయినా ఈసారి కూడా ఉమపైనే నమ్మకం వుంచారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. 

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు ‌- 1,53,623 (63 శాతం)

వైసిపి - మల్లాది విష్ణు - 70,721 (39 శాతం) - 2567 ఓట్లతేడాతో విజయం 

టిడిపి -బోండా ఉమామహేశ్వరరావు - 70,696 (39 శాతం) - ఓటమి

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,70,463 (65 శాతం)

టిడిపి - బోండా ఉమామహేశ్వరావు - 82,669 (48 శాతం) - 27,161 ఓట్ల తేడాతో విజయం

వైసిపి - గౌతమ్ రెడ్డి - 55,508 (32 శాతం) - ఓటమి