డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్ట్ రేపటికి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. కోర్టు సమయం ముగియడంతో రేపు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. హైకోర్ట్ ఆర్డర్ కాపీ వచ్చాకే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఏసీబీ కోర్ట్ వెల్లడించింది.
ఇకపోతే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు మంగళవారం నాడు రిజర్వ్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే , సిద్దార్థ్ లూథ్రాలు వాదించారు.
ALso Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఈ వాదనలను ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా రోహత్గీ చెప్పారు
