చెల్లని కాసు లాంటి మీ మాలోకానికే పెళ్లి కాగా లేనిది... గ్రామ వాలంటీర్లకు పెళ్లిళ్లు కావా అంటూ విజయసాయి రెడ్డి  సెటైర్లు వేశారు. గ్రామ వాలంటీర్లకు పెళ్లిళ్లు కావంటూ... చంద్రబాబు చేసిన కామెంట్స్ కి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈరకంగా సెటైర్లు వేశారు. అయితే... ఈ విషయంలో ఓ నెటిజన్... విజయసాయి రెడ్డికి షాకివ్వడం గమనార్హం. 

ఇంతకీ మ్యాటరేంటంటే... ఏపీలో రూ.5వేల జీతంతో గ్రామవాలంటీర్లను నియమిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. రూ.5వేల జీతంతోపనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో స్పందించారు. వలంటీర్ల వేతనాల గురించి చంద్రబాబు ఎకసెక్కలాడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు, అప్రయోజకుడు, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లికాలేదా? అంటూ పరోక్షంగా లోకేశ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

‘5వేల వేతనంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని @ncbn ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించిన వలంటీర్ సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు?@naralokesh’ అంటూ విజయసాయి ఘాటైన విమర్శలు గుప్పించారు. 

వైసీపీ మద్దతుదారులంతా విజయసాయికి సపోర్ట్ గా ట్వీట్లు  చేస్తుంటే... ఓ నెటిజన్ మాత్రం ఆయనకు షాకిచ్చాడు. రూ.5వేలు జీతం వచ్చే గ్రామ వాలంటీర్ కి మీ మనవరాలిని ఇచ్చి పెళ్లి చేస్తారా అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.