టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  ట్విట్టర్ వేదికగా.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు... బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైఖేల్ ఫారెడీలను మించిపోయారని, మైక్ ఇస్తే చాలు ఏదో మాట్లాడుతున్నారన్నారు. మరో రెండు రోజుల తర్వాత గాలి, నీరు కూడా తానే కనిపెట్టానని అంటారేమో.. హతవిధీ! అని విజయసాయి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో టీడీపీ ఓటర్లు జనసేన వైపు, జనసేన ఓటర్లు బీజేపీ వైపు వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలకు చేశారు. ఏదేమైనా ప్రతిపక్ష పార్టీలు అధికారం మీద ఆశలు వదుకోవాలని, 2024 కంటే 2029 ఎన్నికలకు సిద్ధం కావడమే ఉత్తమమని పత్రి పక్ష పార్టీలకు ఎంపీ విజయసాయి సూచించారు. వైసీపీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధిస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.