Vijayasai Reddy Biography: వైఎస్ జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు పూర్తి మద్దతు తెలపడమే కాకుండా వైఎస్ కుటుంబానికి వెన్నెముకగా ఉండి సహాయ సహకారాలు అందించారు విజయ్ సాయి రెడ్డి.  అందుకే జగన్..  సాయి రెడ్డి గారికి అంతటి విలువిస్తారు.  60 సంవత్సరాల దాటిన కూడా అలుపెరగకుండా ఆర్థిక చాణిక్యుడు, రాజకీయ వ్యవహాలకు పదును పెట్టిన తిట్ట కూడా సాయి రెడ్డి. విధేయతకు విశ్వాసానికి మారుపేరుగా నిలబడ్డారు. విజయసాయి రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం..! 

Vijayasai Reddy Biography:

విజయసాయిరెడ్డి... 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన పూర్తి పేరు వేణుంబిక విజయసాయిరెడ్డి. ఆయన చార్టెడ్ అకౌంట్ పూర్తి చేసి.. చెన్నై ,హైదరాబాద్, బెంగళూరులో సొంతంగా చార్టెడ్ అకౌంట్ కి సంబంధించిన ఆఫీసులు ప్రారంభించారు. ఎన్నో కంపెనీలకు ఆడిటింగ్ చూసేవారు. సాయి రెడ్డి గారు సునంద రెడ్డి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. సునంద రెడ్డి గారు సొంత అక్క కూతురే తారకరత్న గారి భార్య అలేఖ్య రెడ్డి గారు ఆ విధంగా తారకరత్న అల్లుడవుతారు తారకరత్న అకాల మరణంతో సాయి రెడ్డి గారు కూడా కుమిలిపోయారు.

ప్రారంభ జీవితం. 

>> ఇదిలా ఉంటే.. వైఎస్ రాజారెడ్డి దృష్టి విజయసాయిపై పడింది. వెంటనే సాయిరెడ్డిని పిలిపించుకొని మాట్లాడి తన సంస్థల ఆడిటింగ్ మొత్తం చూసుకునే బాధ్యతలు అప్పజెప్పాడు. ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకుంటూనే.. రాజారెడ్డికి ఆర్థిక సలహాలు సూచనలు కూడా ఇచ్చేవారట.ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో కూడా మంచి సాహిత్యం ఏర్పడింది. 

>> వైయస్సార్ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక విజయసాయిరెడ్డిని ఆర్బిఐ కి మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 2006లో సాయి రెడ్డిని టిటిడి మండల సభ్యుడిగా నియమించారు వైఎస్ఆర్.ఇలా ఆయన 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడుగా కొనసాగారు. వైయస్సార్ హయాంలో జగన్ తో కూడా మంచి స్నేహం ఏర్పడింది. జగన్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం వెనుక సాయి రెడ్డి గారి ప్రాద్బలం, ప్రోత్సాహం చాలానే ఉందట. 

>> ఇదిలాఉంటే.. వైఎస్సార్ మద్దతులో ఓబిసి అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు డైరెక్టర్ గా నియమించబడ్డారు విజయసాయి. ఆయన 2006 డిసెంబర్ నుంచి 2009 డిసెంబర్ వరకు ఓరియంటల్ బ్యాంక్ కామర్స్ కి డైరెక్టర్ గా కొనసాగారు. ఇదే పమయంలో 2006 నవంబర్ లో ఏర్పడిన జగతి పబ్లికేషన్ లిమిటెడ్ కి చైర్మన్ గా పనిచేశారు. ఎన్నో సంస్థల నుంచి పెట్టుబడి తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన తీసుకున్నారు.

>> 2007 జూలైలో విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో జగన్ ని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. ఆ సంస్థ డైరెక్టర్ గా ఉంటూ జగతి పబ్లికేషన్స్ కి చైర్మన్ గా ఉండడం ఆర్బిఐ నియమాలను ఉల్లంకించాడనే విమర్శలు కూడా వచ్చాయి. 

రాజకీయ జీవితం

>> 2009 సెప్టెంబర్ లో వైఎస్ఆర్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తండ్రి మరణించాక జగన్ సీఎం పదవిలో కూర్చోవాలని ప్లాన్ చేశాడు కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు విరుద్ధంగా తయారయింది. జగన్ కి సీఎం పదవి ఇవ్వకపోవడంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు. దాంతో జగన్ చేసిన అవినీతి కాంగ్రెస్ బయటకు తీయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 16 నెలలు జైలుకు కూడా పంపించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే .

>> ఆ సమయంలో సాయి రెడ్డి.. వైఎస్ భారతికి అండగా నిలబడి జగతి పబ్లికేషన్స్ కి సంబంధించి ఆడిటింగ్ మొత్తం చూసుకున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా.. జగన్ జైలులో ఉన్న సమయంలో లాభనష్టాలు గురించి ఆలోచించకుండా వారివైపే నిలబడ్డారు. జగన్ జైలు నుంచి బయటికి వచ్చాక సాయి రెడ్డి మరింత క్లోజ్ అయ్యాడు. జగన్ 2011 మార్చిలో వైఎస్ఆర్సిపి పార్టీని ఏర్పాటుచేయడంతో అందులో చేరారు. ఆ పార్టీకి విజయసాయిరెడ్డి సెక్రటరీగా పనిచేశారు.

>> 2014లో వైఎస్ఆర్సిపి ఓడిపోయినా.. 2016లో సాయి రెడ్డి .. వైఎస్ఆర్సిపి తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అప్పటి నుంచే ఆయన వైఎస్ఆర్సిపి లో కీలక నేతగా మారారు. ఒకపక్క 2019 ఎలక్షన్ లో జగన్ పాదయాత్ర చేస్తుంటే.. మరోపక్క విజయసాయిరెడ్డి పార్టీని తన భుజస్కందాలపై మోసి జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 

>> 2019లో వైఎస్ఆర్సిపి 101 సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్ని సాధించడంలో సాయి రెడ్డి గారి పాత్ర కీలకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో .. పార్లమెంటులో అనేక ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన ఘనుడు సాయిరెడ్డి. అలాగే.. ఆంధ్ర ప్రజల వాదాన్ని కేంద్రానికి బలంగా వినిపించగలిగాడు. అయితే వైయస్ వివేకానంద హత్య కేసులు ఏ2 గా ఉన్నాడనే విమర్శ కూడా సాయి రెడ్డి పై ఉంది. పార్లమెంట్ 2024 ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నెల్లుర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు విజయసాయి రెడ్డి. 

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రొఫైల్

పూర్తి పేరు: వేణుంబాక విజయసాయి రెడ్డి
మతం : హిందూ
పుట్టిన తేది: జూలై 1, 1957
విద్యార్హతలు: B.Com, FCA
కుటుంబ వివరాలు 
తండ్రి: దివంగత వి సుందరరామి రెడ్డి
తల్లి :
జీవిత భాగస్వామి: శ్రీమతి సునంద
కూతురు: నేహా