ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని గురువారం ఆ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డిని, లోక్ సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తమకు అత్యున్నత బాధ్యతలు అప్పగించినందుకు జగన్ కి విజయసాయి, మిథున్ రెడ్డిలు దన్యావాదాలు తెలిపారు. జగన్ నివాసంలో కలిసి మరీ దన్యావాదాలు తెలియజేశారు.

అనంతరం విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తమ ప్రభుత్వ చేపడుతున్న మంచుపనులను ప్రజలకు వివరించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలోని తప్పులను ట్విట్టర్ లో ఎండగట్టే ప్రయత్నం చేశారు. 

‘‘జగన్ గారు శారదా పీఠాన్ని సందర్శించడంపై పచ్చ చానల్ ఒకటి చర్చపెట్టింది. కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని తన  అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారు.  పీఠాదిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తారు.’’ అని పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో ‘‘ఐపి ఎస్ ను తాకట్టు పెట్టిన కొందరు అధికారులు పోలీసు శాఖను తెదేపా అనుబంధ విభాగంగా మార్చారు. ప్రజలకు జవాబుదారిగా ఉండే అత్యుమ వ్యవస్థను సృష్టించే పనిలో జగన్ గారు మొదటి అడుగు వేశారు. అధికార పార్టీ వారిని ఒకలా, సాధారణ ప్రజలను మరోలా చూసే రోజులకు చెల్లు.’’ అని పేర్కొన్నారు.