బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారా అని ఆమెను ప్రశ్నించారు. ‘ఎక్స్’ వేదికగా ఆమెపై ప్రశ్నలు సంధించారు.
vijaya sai reddy : వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (vijaya sai reddy).. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (daggubati purandeswari)పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్న టీడీపీకి మద్దతు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయమా ? కుటిల రాజకీయా అని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Scroll to load tweet…
అందులో ‘‘అమ్మా పురందేశ్వరి గారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?’’ అని తీవ్రంగా విమర్శించారు.
