చంద్రబాబు దత్తపుత్రుడికి ఇచ్చిన విలువ సొంత పుత్రుడికి ఇవ్వడం లేదు: విజయసాయి రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రజాస్వామ్య పార్టీ కాదని విమర్శించారు. 

vijaya sai reddy slams chandrababu naidu and lokesh

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రజాస్వామ్య పార్టీ కాదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. లబ్దిదారుల ఖాతాల్లో రూ. 1.4 లక్షల కోట్లు నేరుగా జమ చేశారని తెలిపారు. 

95 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారని చెప్పారు  14 ఏళ్లు సీఎంగా, 13 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఏం సాధించాడని ప్రశ్నించారు. చంద్రబాబు సాధించలేనిది.. సీఎం జగన్ మూడేళ్లలో సాధించారని చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మాట తప్పాడని విమర్శించారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశాడని మండిపడ్డారు. 

జగన్ పేద ప్రజల సొంతింటి కలను నిజం చేశారని చెప్పారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లోని ఆయన సొంతింటితో కలను సాకారం చేసుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు అసభ్యంగా ఉందన్నారు. చంద్రబాబు అనుచరుల చేత బూతులు తిట్టించడం, తోడలు కొట్టించడం చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీలో టీ అంటే తోడలు, డీ-దేహం, పీ- పార్టీ అని ఎద్దేవా చేశారు. సీబీఎన్ అంటే చంద్ర బూతుల నాయుడు అనుకోవాల్సి వస్తుందన్నారు. సీఎం జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టిస్తూ చంద్రబాబు శూనకానందం పొందుతున్నాడని విమర్శించారు. చంద్రబాబును శూనకం నాయుడు అని పిలవడం కూడా తప్పులేదని అన్నారు. 

‘‘లోకేష్ ఒక చవట, దద్దమ్మ. ఈ చవట, దద్దమ్మను కన్నందుకు చంద్రబాబుకు పాశ్చాతాపం కూడా లేదు. చంద్రబాబు దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నాడు. చంద్రబాబు దత్తపుత్రుడికి ఇచ్చిన విలువ సొంత పుత్రుడికి ఇవ్వడం లేదు. ఇంతకంటే గొప్ప తండ్రి ఎవరైనా ఉంటారా..?’’ అని విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ప్రజల మనసులో లేదని విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబుది దుర్మార్గపు ప్రవర్తన అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో మాదిరిగానే.. 2024లో తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలిని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios