అమరావతి: ఏపీ రాష్ట్రంలో కూడ ఈఎస్ఐలో  భారీ కుంభకోణం చోటు చేసుకొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐలో భారీ కుంభకోణం చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈఎస్ఐ డైరెక్టర్‌ దేవికారాణిని అరెస్ట్ చేశారు.

ఏపీ రాష్ట్రంలోని ఈఎస్ఐలో భారీ కుంభకోణానికిసంబంధించిన నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ నివేదిక  విడుదల చేసింది.విజిలెన్స్ నివేదికలో ఈఎస్ఐ డైరెక్టర్లు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో స్పష్టంగా వివరించారు. ఆరేళ్లలో ఈ కుంభకోణం జరిగినట్టుగా ఈ నివేదిక పేర్కొంది. వందల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా ఈ నివేదిక అభిప్రాయపడింది.

 లేని కంపెనీలను ఉన్నట్టుగా సృష్టించి డబ్బులను స్వాహా చేసినట్టుగా  ఈ నివేదిక తేల్చి చెప్పింది.  ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్ , రమేష్, విజయలు  ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా ఈఎస్ఐలో చోటు చేసుకొన్ని  అక్రమాలపై విజిలెన్స్ నివేదిక తేల్చింది.

Also read:ఈఎస్ఐ స్కాం: దేవికారాణి చుట్టుూ బిగిస్తున్న ఈడీ ఉచ్చు

 వాస్తవ ధర కంటే సుమారు 132 శాతం అధికంగా ఆయా కంపెనీలను ఈఎస్ఐ నుండి డబ్బులు చెల్లించినట్టుగా విజిలెన్స్ నివేదిక చెప్పింది. ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయలకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు, సీనియర్  అసిస్టెంట్లు సహకరించినట్టుగా  ఈ నివేదిక తేల్చి స్సష్టం చేసింది. 

లెజెండ్, ఓమ్ని ఎండీ  ఎన్వెంటర్, ఫెర్మామెన్స్ సంస్థలకు  భారీగా ఈఎస్ఐ నుండి  నిధులను చెల్లించినట్టుగా విజిలెన్స్  సంస్థ తేల్చింది. సుమారు రూ. 100 కోట్లకు పైగా లేని సంస్థలకు నిధులను చెల్లించినట్టుగా విజిలెన్స్ తేల్చి చెప్పింది. లేని కంపెనీల నుండి కొటేషన్లను తీసుకొని  బిల్లులను చెల్లించారని ఈ నివేదిక అభిప్రాయపడింది.