బుధవారం కడప జిల్లా మైదుకూరు రోడ్డులో వెళుతున్న లోకేష్ ను కలవటానికి అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డుపై ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు.
కడప జిల్లాలో నారా లోకేష్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం కడప జిల్లా మైదుకూరు రోడ్డులో వెళుతున్న లోకేష్ ను కలవటానికి అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డుపై ప్లకార్డులు పట్టుకుని బారులు తీరి నిలబడ్డారు. తమ నోళ్ళకు నల్లటి రిబ్బన్లు కట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా స్ధాయిలో అగ్రిగోల్డ్ సంస్ధకున్న భూములను వేలం వేసే అధికారం జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలంటూ బాధితులు లోకేష్ ను కోరారు. సంవత్సరాలు గడుస్తున్నా తమ కష్టాలు తీరటం లేదని చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నట్లు బాధితులు చెప్పారు. బాధితుల వైఖరిని గమనించిన లోకేష్ వెంటనే బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
