చంద్రబాబుకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాం. గెలుపుకు త‌న సోద‌రి అఖిల ప్రియ ఎంతో కృషి చేసింద‌న్నారు. తన గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. తన గెలుపుకు టీడీపీ కార్యకర్త నుండి అధినేత వరకు ఎంతో శ్రమించారని ఆయన తెలిపారు. ముఖ్యంగా తన సోదరి అఖిల ప్రియ ఎంతో కృషి చేసిందన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన విజయానికి కారకులైన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తన తండ్రి లేకపోయినా బాబాయి భూమా నాగిరెడ్డి, పిన్ని శోభా నాగిరెడ్డి చేతుల్లో తాను పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందన్నారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. నంద్యాలలో ఫ్యాక్షన్ అన్నది చరిత్రగా అభివర్ణించారు. ప్యాక్షన్ రాజకీయాలు అనేది ఇప్పుడు లేదని భూమా చెప్పారు. టీడీపీ వైపు యువత, మహిళలు అధిక సంఖ్యలో ఆకర్షితులవుతున్నారని అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం కింద క్లిక్ చేయండి
