గుంటూరు: తన కూతురిని ప్రేమించిన యువకుడి కాళ్లు, చేతులు నరికాడు ఓ దుండగుడు, ఆసుపత్రులో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.ఈ ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం నాడు చోటు చేసుకొంది. జిల్లాలోని  పెదకాకాని మండలం కొప్పురావూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకొంది. ఇదే గ్రామానికి చెందిన  వెంకటేష్ కి అదే  గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ విషయం తెలిసిన అమ్మాయి పేరేంట్స్  వెంకటేష్ ను పిలిపించి మందలించారు. ఈ ఘటన జరిగిన రోజు నుండి వెంకటేష్ గ్రామానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఫోన్ లో మాత్రం యువతితో మాట్లాడుతున్నాడు.వెంకటేష్ ను  అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించారు. మాట్లాడాలని చెప్పి  యువతి తండ్రి భాస్కర్ రావు మరో ఐదుగురు  మారణాయుధాలతో కాళ్లు,చేతులు నరికారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు వెంకటేష్ ను గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  వెంకటేష్  బుధవారం నాడు మరణించాడు.