Asianet News TeluguAsianet News Telugu

వెంకటగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

150 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి చీరలను 17వ శతాబ్ధంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి వెంకటగిరి నుంచి ప్రాతినిథ్యం వహించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇదే నియోజకవర్గంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ , వైసీపీ ఒకసారి గెలిచాయి. వెంకటగిరిలో విభిన్న పరిస్ధితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీ అభ్యర్ధిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ప్రకటించారు జగన్. కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియాకు టికెట్ కేటాయించారు చంద్రబాబు.

Venkatagiri Assembly elections result 2024 ksp
Author
First Published Mar 30, 2024, 5:40 PM IST

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం పేరు తెలియని తెలుగువారుండరు. రాజులు, రాచరికం ఒకప్పుడు వెంకటగిరిలో రాజ్యమేలింది. ఇక వెంకటగిరి వస్త్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి చీరలను 17వ శతాబ్ధంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. రాజకీయాల విషయానికి వస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి వెంకటగిరి నుంచి ప్రాతినిథ్యం వహించారు. పదిలేటి , ఓరేపల్లి, నల్లపరెడ్డి, ఆనం, నేదురుమల్లి కుటుంబాలు వెంకటగిరిలో రాజకీయాలు చేశాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇదే నియోజకవర్గంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 

వెంకటగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట :

1952లో ఏర్పడిన వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,295 మంది. వీరిలో పురుషులు 1,16,990 మంది.. మహిళలు 1,22,301 మంది. ఈ సెగ్మెంట్ పరిధిలో కాలువోయ, రాపూర్, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లె మండలాలున్నాయి. వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ , వైసీపీ ఒకసారి గెలిచాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆనం రామనారాయణ రెడ్డికి 1,09,204 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కురుగుండ్ల రామకృష్ణకు 70,484 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 38,720 ఓట్ల మెజారిటీతో వైసీపీ తొలిసారిగా వెంకటగిరిలో జెండా పాతింది.

వెంకటగిరి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నేదురుమల్లి వారసుడు :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. వెంకటగిరిలో విభిన్న పరిస్ధితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. సీఎం జగన్, వైసీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయడంతో ఆనంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్. దీంతో రాంనారాయణ రెడ్డి టీడీపీలో చేరారు.

2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ప్రకటించారు జగన్. తన కుటుంబానికి వున్న బ్రాండ్ ఇమేజ్, రెడ్డి సామాజికవర్గానికి పట్టు, వైసీపీ సంక్షేమ పాలన తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియాకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనకు కలిసొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios