టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు ఎన్టీఆర్ పై  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తాను ఎన్టీఆర్ ని కలిసిన సందర్భాన్ని వెంకయ్య  గుర్తు చేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ప్లాటిన్ జూబ్లీ వేడుకలో వెంకయ్య ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. కష్టపడితే ఎవరూ నష్టపోరని.. తాను కష్టపడే ఇంత వరకు వచ్చానని తెలిపారు. గతంలో ఒకసారి తాను ఎన్టీఆర్ ని కలవాడానికి వెళ్లానని ఆయన గు ర్తు చేసుకున్నారు. 

ఆ  సమయంలో చాలా మంది స్త్రీలు ఎన్టీఆర్ కు పాదాభివందనం చేయడం తాను చూశానన్నారు. ఇది మంచి పద్దతి కాదని.. తాను ఎన్టీఆర్ కి చెప్పానని.. అందుకు ఆయన అది వాళ్ల ప్రేమ అని చెప్పారని వెంకయ్య తెలిపారు. కానీ.. ఆరు నెలల తర్వాత వాళ్లే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పోడిచారని వెంకయ్య వ్యాఖ్యానించారు.

పదవులను బట్టి ప్రేమ ఉండరాదని వెంకయ్య పేర్కొన్నారు. అనంతరం సంస్కృతి, సంప్రాదాయాల గురించి మాట్లాడారు. మాతృభాషను కాపాడుకోవాలని సూచించారు.