విజయవాడ: కరోనా కష్టకాలంలోనూ అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే టిడిపి నాయకులు బోండా ఉమ, కేశినేని నానిలపై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. అయితే  సాక్షాత్తు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిని రాజకీయాల కోసం వాడుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చర్యలు తీసుకుంటారంటూ ముఖ్యమంత్రి జగన్ ను మాజీ మంత్రి ప్రశ్నించారు.  

''దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలా? కరోనా కలెక్షన్లలో కోట్లు దండుకున్నారు ప్రశ్నించిన కేశినేని నాని, బోండా ఉమలపై కేసులు పెట్టారు. దుర్గగుడి ప్రతిష్టను దిగజారుస్తూ అమ్మవారి గుడిని పార్టీ సమావేశాలకు ఉపయోగించిన వెల్లంపల్లిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్ గారు'' అంటూ ట్విట్టర్ వేదికన నిలదీశారు. 

''1400ఎకరాల ప్రజలభూమిని 10వేలకోట్ల కోసం అమ్మే అధికారం మీకుఎవరిచ్చారు? కోట్లుపెట్టి తెచ్చుకున్న మీసలహాదారులు ఇచ్చేసలహాలు ఇవేనా? మీ ముందు ముఖ్యమంత్రులు ఇదే చేసుంటే రాష్ట్రంలో అసలా భూమి మిగిలేదా?భావితరాల భవిష్యత్తుని వేలంవేయాలనే ఆలోచనని తక్షణమే విరమించుకోండి ముఖ్యమంత్రి 
వైఎస్ జగన్ గారు'' అని సూచించారు.