Asianet News TeluguAsianet News Telugu

వెల్లంపల్లి శ్రీనివాస్ : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Vellampalli Srinivas Biography: ఏపీలోని విజయవాడ రాష్ట్ర రాజకీయాలకు కేంద్రం. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి ప్రత్యేకం. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా సేవలందించిన వైసిపి నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ మీకోసం.. 

Vellampalli Srinivas Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 31, 2024, 11:59 PM IST

Vellampalli Srinivas Biography: ఏపీలోని విజయవాడ రాష్ట్ర రాజకీయాలకు కేంద్రం. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి ప్రత్యేకం. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా సేవలందించిన వైసిపి నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ మీకోసం.. 

బాల్యం, కుటుంబ నేపథ్యం 

వెల్లంపల్లి శ్రీనివాస్.. 1973లో విజయవాడకు చెందిన వెల్లంపల్లి సూర్యనారాయణ - మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన జిల్లాలోని  ఎస్.కె.పి.వి.వి హిందూ హై స్కూల్ లో పదోతరగతి వరకు అభ్యాసించారు. కుటుంబ పరంగా చూస్తే.. వారి కుటుంబంలో అందరూ వ్యాపారస్తులే. కానీ,  వెల్లంపల్లి శ్రీనివాస్ కు రాజకీయాలంటే ఇష్టం. ప్రజాసేవ చేయాలని ఆయనకు ఉండేది. ఓ పక్క వ్యాపారం చేస్తూనే ప్రజాసేవ చేసేవారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబం గురించి చూస్తే.. ఆయన భార్య పేరు శ్రీవాణి, వారికి ఒక కుమార్తె. 

రాజకీయ ప్రవేశం

ప్రజసేవ చేయాలనే ఆసక్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వెల్లంపల్లి శ్రీనివాస్.ఆయన 2009లో వంగవీటి రాజా సహాయంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనతికాలంలోనే మెగా స్టార్ చిరంజీవికి బాగా దగ్గరయ్యారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డ  ఆయనకు ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.

అయితే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లికా బేగంపై 8,342 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ.. బిజెపిలో చేరారు. ఇలా 2014 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ నుంచి బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడిన జలీల్ ఖాన్ గెలుపొందారు.

వైసీపీ లో చేరిక 

తొలుత ప్రజారాజ్యం, ఆ తరువాత బీజేపీ లోకి చేరిన వెల్లంపల్లి శ్రీనివాస్ .. వైఎస్ జగన్ పట్ల ఆకర్షితులై.. బిజెపికి రాజీనామా చేసి 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ తరుణంలో ఆయనను విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పశ్చిమ ఇన్చార్జిగా నియమించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన సిగ్మెంట్లో పార్టీని నిలబెట్టారు. వెల్లంపల్లి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆయనకు ఎన్నికల్లో 7,671 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏపీలో వైసీపీకు అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ తొలి క్యాబినెట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ కి మంత్రిగా అవకాశం ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో జగన్ మంత్రిమండలిలో మంత్రిగా తన మార్కు పాలన చూపించారు.

 అవినీతి ఆరోపణ లేని వెల్లంపల్లి శ్రీనివాస్ కి వైసీపీ అధినేత జగన్ మరోసారి అవకాశం కల్పించారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆయనను విజయవాడ వెస్ట్ కాకుండా విజయవాడ సెంట్రల్ ను బరిలో దించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ వెస్ట్ నుంచి షేక్ అసిఫ్ కు టికెట్ కేటాయించారు .ఈసారి ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి బిజెపి జనసేన టిడిపి అభ్యర్థిగా బోండా ఉమా పోటీ చేస్తున్నారు. వైసిపి తరఫున మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios