ప్రభుత్వాన్ని వెంటాడుతున్న వాస్తు దోషాలు

vastu defects haunting  Andhra temporary secretariat at amaravati
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వాస్తు దోషాలు ఇప్పట్లో వదిలేలా లేవు.

వందల కోట్ల రూపాయలు వ్యయంతో వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టించిన దగ్గర నుండి ఎక్కడో ఓ చోట గోడలు కూలుస్తున్నారు, మళ్ళీ కడుతూనే ఉన్నారు.

తాజాగా అసంబ్లీ-సచివాలయం మధ్య వాస్తు దోషం ఉందన్న కారణంతో 6వ గేటు ఏర్పాటు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వాస్తు దోషాలు ఇప్పట్లో వదిలేలా లేవు. వందల కోట్ల రూపాయలు వ్యయంతో వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టించిన దగ్గర నుండి ఎక్కడో ఓ చోట గోడలు కూలుస్తున్నారు, మళ్ళీ కడుతూనే ఉన్నారు. తాజాగా అసంబ్లీ-సచివాలయం మధ్య వాస్తు దోషం ఉందన్న కారణంతో 6వ గేటు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు అసెంబ్లీ భవనంలో మరికొన్ని మార్పులు, చేర్పులు చేయాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వం.

ఇప్పటికే వాస్తు దోషం అంటూ సచివాలయంలో చాలా మార్పులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  దాంతో పాటు అసెంబ్లీ భవనానికి కూడా అనేక మార్పులు చేసారు. కొత్తగా వాస్తు పేరుతో సచివాలయం వైపు అధికారులు కొత్త గేటు ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలో వాస్తు దోషం కారణంగానే ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సచివాలయంకు వచ్చే దారిని సైతం మార్చుకున్న సంగతి అందరూ చూస్తున్నదే.

అంతేకాకుండా సచివాలయంలో పలు గోడలు పగులగొట్టారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు నుండి టీడీపీ సర్కారుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్ది రోజులకే కరీంనగర్ కోర్టు నుండి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా నోటీసులు అందుకున్నారు.

దాంతో టిడిపి నేతలకు వాస్తు భయం మొదలైంది. దీంతో అనేకమంది వాస్తు పండితులను పిలిపించి చూపించారు. వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక లోపాన్ని చూపుతున్నారు. దాంతో అసెంబ్లీ, సచివాలయం భవనాలు కట్టిన దగ్గర నుండి మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. అంతుకుముందు హైదరాబాద్ లోని సచివాయలంకు కూడా వాస్తు కారణంగానే అనేక మార్పులు చేర్పుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. అంత వాస్తు చూసి, ప్రత్యేక పూజలు చేయించినా చివరకు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నది 8 మాసాలే. తాజాగా వెలగపూడి సచివాలయానికి ఆరో గేటు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు చేస్తుందో చూడాలి.

loader