వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను విచారించాలని టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. జగన్ బాబాయి వివేకానంద  రెడ్డి ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు వ్యవహారం ఇప్పటి వరకు తేలనేలేదు.

ఈ నేపథ్యంలో ఈ కేసు గురించి టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి.. ఇంటి దొంగలను వదిలిపెట్టారన్నారు. ఎవరి ఆదేశాలతో ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఎందుకు తీసుకోలేదని  ప్రశవ్నించారు. 

 తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురికి తెలుసునని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఆపాలని సిట్‌కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు.