హీరోలంతా సీఎంలు కాలేరు. అది ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. పవన్‌ అన్న మెగాస్టార్‌ చిరంజీవి సీఎం కాగలిగారా? కుర్చీ పొందడం అంత ఈజీ కాదు’’ అని చెప్పారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య సంచలన కామెంట్స్ చేశారు. ‘‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సామాజిక తీవ్రవాది. వైసీపీ అధినేత జగన్‌ ఆర్థిక ఉగ్రవాది. వీరిద్దరూ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ రాజకీయాలను చెరబడుతున్నారు’’ అని వర్ల రామయ్య ఆరోపించారు.

విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ‘‘ముగ్గురు వ్యక్తులు తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వారెవరో కూడా తనకు తెలుసునని చెబుతున్న పవన్‌ మాటల్లో నిజం లేదు. అందుకే ఆయన ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారు. గతంలో కూడా లోకేశ్‌పై చౌకబారు ఆరోపణలు చేశారు. ఆధారాలతో నిరూపించాలని లోకేశ్‌ సవాల్‌ విసిరేసరికి పవన్‌ తోక ముడిచారు’’ అని అన్నారు. ‘‘హీరోలంతా సీఎంలు కాలేరు. అది ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. పవన్‌ అన్న మెగాస్టార్‌ చిరంజీవి సీఎం కాగలిగారా? కుర్చీ పొందడం అంత ఈజీ కాదు’’ అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో అవినీతి జరిగితే కేంద్రం అవార్డులు, రివార్డులు ఎందుకు ఇస్తుందని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌... బీజేపీ, వైసీపీ నాయకులను ప్రశ్నించారు. బీజేపీకి ఉపశాఖగా వైసీపీ పనిచేస్తోందని, బీజేపీ నాయకుడు జీవీఎల్‌ అప్పుడప్పుడూ వచ్చి మొరిగిపోతారని హైదరాబాద్‌లో మండిపడ్డారు. బీ అంటే బాధ్యతలేని, జే అంటే జగన్‌, పీ అంటే పవన్‌ అని బీజేపీని ఎద్దేవా చేశారు. రాఫెల్‌ కుంభకోణం గురించి మాట్లాడాలంటే జగన్‌కు జంకు, పవన్‌కు పరుగు అని ఎద్దేవా చేశారు.