జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్‌ కల్యాణ్‌పై ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడటు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విజయవాడ : జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్‌ కల్యాణ్‌పై ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడటు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయంపై స్పందిస్తూ - పవన్‌ కల్యాణ్ సీఎం పదవి కోసమే రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. 

కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. "నేను సినిమా హీరోను.. సీఎం పదవి ఇచ్చేయ"మంటే ప్రజలు పవన్‌కు అధికారాన్ని ఇవ్వరని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో పవన్‌ సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి కూడా సీఎం పదవి కోసం ఇలానే తిరిగారని ఆయన అన్నారు. 

సినిమా హీరోలను ముఖ్యమంత్రులుగా ఆదరించే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు మాత్రమే ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రిగా ఆదరించారని వర్ల వర్ల అన్నారు.