గుంటూరు: కేంద్రానికి లేఖ రాసినట్లు మాజీ ఎస్ఈసి రమేష్ కుమార్ స్వయానా ఒప్పుకున్నా వినరా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. సీఐడీ దర్యాప్తు పేరుతో కోర్టులను పక్కదారి పట్టించేందుకు వైకాపా కుయుక్తులు పన్నుతోందని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. 

నేరాలు, ఘోరాలు, మోసాలు చేసే విజయసాయి రెడ్డి రంగు ప్రజలకు ఎరుకేనని, కేంద్ర హోం శాఖకు మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి  తమ పార్టీ నాయకులు లేఖ పంపినట్లు  తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని ఆయన అన్నారు. కరోనా నేపధ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని,  వైకాపా ప్రభుత్వ దురుసుతనం మూలంగా రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని  స్వయంగా రమేష్ కుమార్ వెల్లడించినా విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం భావ్యం కాదని వర్ల అన్నారు. 

"రమేష్ కేంద్రాన్ని రక్షణ కోరితే సిగ్గుపడాల్సిన ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు.  ``తెదేపా నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య పేర్లు వాడి మా గౌరవానికి భంగం తెచ్చినందుకు సోమవారం పరువునష్టం దావా వేస్తున్నట్లు నోటీస్ పంపిస్తున్నాను.’’అని వర్ల స్పష్టం చేశారు.  లేఖ తాము సృష్టించలేదని మీడియా  ముందు క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తా నని తేల్చి చెప్పారు. 

 రమేష కుమార్ సంతకాన్ని తెదేపా నాయకులు ఫోర్జరీ చేశారని డీజీపీకి ఆధారరహితంగా ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.   ``దొంగ సంతకాలు చేయడంలో విజయసాయిరెడ్డి నేర్పరి. ఆ లేఖ ఫోర్జరీ రమేష్ కుమార్ రాశానను చెప్పారు అంతకన్నా ఏంకావాలి.  న్యాయస్థానాలను తప్పు పట్టించడానికి తాపత్రయపడుతున్నారు. రమేష్ కుమార్ పై అనుమానాలు రేకెత్తేలా ఆరోపణలు, ఫిర్యాదు చేసి  సీఐడీ దర్యాప్తు చేస్తోందని కోర్టులను తప్పుదారి పట్టించడానికి కుయుక్తులు పన్నుతున్నారు" అని వర్ల అన్నారు. 

"కనకరాజ్ ను ఎస్ ఈ ఎస్ గా.నియమించడంపై  కోర్టు   సోమవారం వాదన విననుంది. రమేష్.రాసిన లేఖ వ్యవహారంలో  తప్పుడుఫిర్యాదు చేసి   సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందని వర్ల  అనుమానం వ్యక్తం చేశారు. వైకాపా  నేతలు  మోసాల్లో ఫోర్జరీల్లో మునిగి తేలినవాళ్ళు. ``ప్రతిశుక్రవారం బోనులో నిలగడి వస్తారు. కోర్టులలో ఎన్ని మొట్టి కాయలు వేసినా దున్నపోతుపై వర్షం కురిసినట్లు’’ వ్యహరిస్తున్నారని విమర్శించారు. 

"జగన్ బృందంపై 9 ఏళ్ళుగా కేసులున్నాయి. సత్వరంపరిష్కారం చేయాలని కోర్టులను చేతులెత్తి నమస్కరించి  కోరుతున్నా.  కోర్టుల్లో కేసులు వాదనలు పూర్తయితే నిందితుల బండారం బయటపడుతుంది. జగన్ పరిపాలించడానికి ,  బయట తిరగడానికి అర్హులా లేదా తేలుతుంది. సీఎంకు కూడ విచారణ వేగవంతంగా పూర్తీ చేయలని కోర్టులను ఎందుకు కోరారు.  పోలీసులు, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్ ను చీకటిలో బందీగా ఉంచుతున్నారా?" అని ఆయన అన్నారు. 

"ముఖ్యమంత్రికి తెలిసినట్లయితే కరోనా విభృంచడానికి కారణమైన  విజయతోపాటు పలువురు ఎమ్మెల్యేలను   కోరంటైన్ లో ఉంచమని ఆదేశించేవారే. ప్రజలకు, ముఖ్యమంత్రికి మధ్య దూరం పెడుతున్నారు. వైకాపా నేతల చరిత్ర అందరికీ తెలుసు. న్యాయస్థానాలలో వాదనలను పక్కదారి  పట్టించడానికి లేనిపోని ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం తగదని వారించారు. ``వెనుకటి గుణమేల మాను వినరా’’ అని  సుమతీ శతకంలో పేర్కొన్నట్లు అధికారంలోకి వచ్చిన పెద్దలు ఏ1,ఏ 2ల తీరు ఉందని ఆక్షేపించారు. 

"జగన్, విజయసాయిరెడ్డిలు   11 కేసుల్లో ముద్దాయిలని ప్రజల సొమ్ము రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని  సీబీఐ పేర్కొంది.  వీళ్ళతోపాటు మోపిదేవి, ధర్మాన ప్రసాద రావులు 16 నెలలు ఖైదీలుగా ఉంది వచ్చిన వాళ్ళు  స్వేచ్చగా  తిరగడానికిలేదు. వీళ్ళను అదుపులో పెట్టాలని సవినయంగా పోలీసులు, న్యాయస్థానాలకు  విన్నవిస్తున్నాను" అని అన్నారు. 

"కండిషన్ బెయిల్ పై ఉన్న ముద్దాయిలు తిరుగుతూ ఉంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మూమెంట్స్, వ్యవహారశైలిపై వాచ్ చేయాలి. అవసరమైతే సస్పెక్ట్ షీట్లు పెట్టాలి. తప్పుడు ఫిర్యాదులపై సమయం వృధా చేయవద్దు. అనిపోలీసులకు వర్ల సూచించారు.  అధికారంలో ఉన్నప్పటికీ  వీరంతా   ఔన్నత్యం కోల్పోయారని పేర్కొన్నారు. ``ప్రజలు గుడ్డివారు, అమాయకులు కాదు  వైకాపా నేతల  చరిత్ర తెలిసిన వారే’’ అని పేర్కొన్నారు.