ఎంతకు అమ్ముడుపోయావ్..? పవన్ ని ప్రశ్నించిన వర్ల

First Published 21, Jul 2018, 3:10 PM IST
varla ramaiah fire on pawan and jagan
Highlights

చిల్లర నాయకుడు పవన్, దొంగల నాయకుడు జగన్ అంటూ వర్ల రామయ్య  విమర్శలు గుప్పించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. కేంద్రంలోని బీజేపీకి అమ్ముడుపోయాడని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్ష నేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ లపై వర్ల రామయ్య మండిపడ్డారు.

శనివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. పవన్, జగన్ లపై మండిపడ్డారు. ట్విట్టర్ వీరుడు పవన్‌కళ్యాణ్ అవిశ్వాసం తీర్మానంపై లోక్‌సభలో చర్చ పూర్తవకుండానే ట్వీట్లు పెట్టారని విమర్శించారు. ‘బీజేపీకి ఎంతకు అమ్ముడు పోయావు పవన్‌.. దమ్ముంటే‌ నిజం చెప్పు’ అంటూ సవాల్ విసిరారు. అవిశ్వాస తీర్మానం నుంచి పారిపోయిన పిరికివాడు జగన్ అని వర్ల వ్యాఖ్యానించారు. 

మోదీని నిలదీయాల్సి వస్తుందనే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించారని ఆరోపించారు. జగన్ లాంటి పనికిమాలిన నాయకుడు ప్రజలకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. చిల్లర నాయకుడు పవన్, దొంగల నాయకుడు జగన్ అంటూ వర్ల రామయ్య  విమర్శలు గుప్పించారు.

loader