పటిష్టమైన సాక్ష్యాలు ఉన్నా కేసు నీరుగారుస్తున్నారని వర్లరామయ్య ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోదీ ఏ హామీ ఇచ్చారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు కేసును తొక్కిపట్టే ఒప్పందం జరిగిందని అందువల్లే జగన్ కేసుల విషయం మందుకు కదలడం లేదన్నారు. 

విజయవాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. జగన్‌-సీబీఐ కలిసి ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌పై చార్జిషీటు దాఖలు చేసి ఏడేళ్లు పూర్తైందని చెప్పుకొచ్చారు. 

పటిష్టమైన సాక్ష్యాలు ఉన్నా కేసు నీరుగారుస్తున్నారని వర్లరామయ్య ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని మోదీ ఏ హామీ ఇచ్చారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు కేసును తొక్కిపట్టే ఒప్పందం జరిగిందని అందువల్లే జగన్ కేసుల విషయం మందుకు కదలడం లేదన్నారు. 

రాజకీయ లబ్దికోసమే నేరస్థులతో మోదీ కలుస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ను బీజేపీ వదిలిపెట్టినా తాము వదిలిపెట్టేది లేదన్నారు. జగన్ ఎంతటి అవినీతిపరుడో అందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమ వద్ద ఉన్నాయని వర్ల రామయ్య తెలిపారు.