వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. జగన్ సీఎం పదవి కోసం ఎంతకైనా దిగజారతాడన్నారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజకీయ లబ్ధికోసం జగన్‌ ఎంతకైనా దిగజారుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకాను ఎవరు చంపారో జగన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. సిట్‌ బాగా దర్యాప్తు చేస్తోందని మీ చెల్లెలు సునీత చెప్పారు కదా అన్నారు. ఆదినారాయణరెడ్డి, లోకేష్‌కు జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ కోరితే గవర్నర్‌ వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్నారు. జగన్‌ అంటే గవర్నర్‌కు ఎందుకు అంత ఇష్టం? అని వర్ల అడిగారు.