Asianet News TeluguAsianet News Telugu

వంగవీటి రంగా వారసురాలు పొలిటికల్ ఏంట్రీ ..! ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారంటే..!?

వంగవీటి రంగా.. ఈ పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్..ఆయన బెజవాడ అడ్డగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమ్మెల్యేగా ఒక్కసారే గెలిచినప్పటికీ..  రాజకీయాల్లో ఆయన పేరు మాత్రం ఇప్పటికీ చెరగని ముద్ర వేస్తూనే ఉంది. తాజాగా ఆయన వారసురాలు పొలిటికల్ ఏంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

Vangaveeti Ranga daughter Asha latha is going to enter politics KRJ
Author
First Published Jul 26, 2023, 11:24 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉన్నాయి. అయితే..  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ అధికారం దక్కించుకోవాలని అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ను గద్దె దించి.. అధికార పగ్గాలను కైవసం చేసుకోవాలని ప్రధాన ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలోనే బెజవాడ రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

బెజవాడ రాజకీయాలంటే.. మొదటగా మాట్లాడుకునేది స్వర్గీయ వంగవీటి రంగా.. ఆయన పేరు వింటేనే ఏదో ఎమోషన్.. తెలియని వైబ్రేషన్. బెజవాడ సెంట్రర్ గా రంగా పొలికట్ ఎంట్రీ ఇచ్చారు.  నిరుపేదల పక్షాన నిలిచిన నాయకుల్లో రంగ ముందు వరుసలో ఉంటారు. ఆయన అన్ని సామాజిక వర్గాల వారికి అండగా  నిలిచినా.. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో మాత్రం ఆయన దేవుడిలా కొలుస్తారు. అందుకే ఆయన పేరు చెప్పుకుని.. ఎన్నో రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకున్నాయి. అధికారాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజీని వర్క్ అవుట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాయని కొన్ని రాజకీయ పార్టీలు. 

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు వారి వ్యూహ ప్రతి వ్యూహాలను రచిస్తున్నారు. ఇలాంటి పరిమాణాల నేపథ్యంలో అధికార ప్రతిపక్షం టీడీపీ .. అన్ని రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే ఐడియాతో ముందుకు రానున్నది. అదే.. వంగవీటి రంగా వారసురాలు పొలిటికల్ ఏంట్రీ.. రంగా కుమార్తె ఆశాలతను రాజకీయాల్లోకి తీసుకరావాలని టీడీపీ  ప్రయత్నిస్తుంది. అదే కాదు.. రంగా అడ్డా అయినా.. బెజవాడ సెంట్రల్ నుంచి ఆమెను ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది.  

వంగవీటి రంగా  చరిష్మాను ఉపయోగించుకోని.. రాజకీయ వారసత్వాన్ని బలంగా జనంలోకి తీసుకుపోవడానికి ఆయన వారసురాలు ఆశాలతను.. ఎన్నికల్లో రంగా కుటుంబానికి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న విజయవాడ సెంట్రల్ నుండి బరిలోకి దించాలనే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. రంగాపై ఉన్న అభిమానం ఓటు బ్యాంకుగా మారుతుందని భావిస్తున్నారు. 

వాస్తవానికి వంగవీటి రంగా హత్య అనంతరం ఆయన భార్య రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాను కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే  రత్నకుమారి కానీ, కుమారుడు రాధాకృష్ణ కానీ రాజకీయాలలో అంతగా రాణించలేకపోయారు.
ప్రస్తుతం రత్నకుమారి రాజకీయాలకు దూరంగా ఉండగా.. వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయన రంగాలాగా కాకుండా.. చాలా లోప్రొఫైల్ మెయింటెన్ చేస్తారు. ఆయనకు కాపు సామాజిక వర్గంలోనూ అంతగా సన్నిహిత సంబంధాలను లేవనేది టాక్. అలాగే ఆయనది దూకుడు స్వభావం.. తొలుత కాంగ్రెస్.. ఆ తరువాత పీఆర్పీ( చిరంజీవీ పార్టీ).. ఆ తరువాత వైసీపీ.. అక్కడ విభేదాలు రావడంతో చివరగా తెలుగు దేశంలో చేరారు. 

ఈ క్రమంలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసం వంగవీటి ఆశాలతను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ కలిసి వస్తే.. రంగా వారసురాలు వంగవీటి ఆశాలత రాజకీయాల్లోకి అడుగుపెట్టడం మాత్రం ఖాయం. అదే సమయంలో విజయవాడ సెంట్రల్ నుండి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios