ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో పైకి వచ్చారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరిపైన ఆధారపడలేదని చెప్పారు. 

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినా ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో పైకి వచ్చారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరిపైన ఆధారపడలేదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లితో సహా ఆయన అభివృద్దిలో ఎవరి పాత్ర లేదని అన్నారు. ఆయన కష్టపడి ట్యాలెంట్‌తో పైకి వచ్చారని చెప్పారు. అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయి.. అవన్నీ చెబితే చాలా మంది నిద్రపోరని అన్నారు. 2009లో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని.. ఆయనను వాడుకుని కరివేపాకులా వదిలేశారని అన్నారు. ప్రతి సమస్యలో జూనియర్ ఎన్టీఆర్ పేరును లాగడం మంచి పద్దతి కాదని అన్నారు.

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినా ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గదని వంశీ అన్నారు. ‘‘జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్నవారు ఎవరైనా స్వాగతించారా?. హైదరాబాద్‌లో విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ గొడవ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గన్నవరం ఎయిర్‌పోర్టును.. అంతర్జాతీయ విమానాశ్రయంగా చేశారు. మరి అప్పుడు గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే.. ఆయన పేరును భారతరత్నకు ప్రతిపాదించేవాడు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేవారన్నారు. ఒక ఇంట్లో 2 ఎలుకలు తిరుగుతుంటే ఇల్లు తగలెట్టేయండి అని సలహా ఇచ్చే వ్యక్తే చంద్రబాబు’’ అని వల్లభనేని వంశీ విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అడిగిన, ఆడగకపోయినా.. ప్రతి విషయంలో స్పందిస్తారని విమర్శించారు.