వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పని పాట లేవని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతారని విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. వాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసని అన్నారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క పగల్దీసి డోలు కడతామని హెచ్చరించారు. వార్డుకు, పంచాయితీకి గెలవని వాళ్లు తనకు సహకరించేది ఏమిటని విమర్శలు గుప్పించారు. వంశీని, నానికి తిడితే పెద్ద వాళ్లం అవుతున్నామని వాళ్లే అంటున్నారుగా అని అన్నారు.
గన్నవరం వైసీపీలో చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ నేతల మధ్య విబేధాలు ఏ స్థాయిలో వున్నాయో తెలియజేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లపై వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘వాడు కొడాలి నాని ఏడో తరగతి తప్పిన వెధవ... ఏం చేసి ఇంత డబ్బులు సంపాదించాడు? అంటూ ప్రశ్నించారు. వీళ్లు తమ నియోజకవర్గాలకు ఎందుకైనా ఉపయోగపడతారా...? అన్నారు. ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది... వీళ్లకు అలాగే ఉంది’’ అంటూ దుట్టా, యార్లగడ్డ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
