Asianet News TeluguAsianet News Telugu

వల్లభనేని బాలశౌరి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Vallabhaneni Balasouri Biography: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇటీవల వైఎస్ఆర్‌సీపీని వీడి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరిని మచిలీపట్టణం  పార్లమెంట్ స్థానం నుండి ఎన్నికల బరిలో దించింది టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి రియల్ స్టోరీ మీ కోసం.. 

Vallabhaneni Balashowry Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Apr 1, 2024, 6:47 AM IST

Vallabhaneni Balashowry Biography: వల్లభనేని బాలశౌరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. ఆయన మరణాంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. కానీ, వైసీపీలో తలెత్తిన అంతర్గత కారణాల వల్ల పార్టీని వీడిన ఆయన జనసేనలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ స్థానం నుండి  జనసేన అభ్యర్ధిగా బాలశౌరిని బరిలోకి దింపింది జనసేన. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం మీ కోసం..  

బాల్యం, విద్యాభ్యాసం

వల్లభనేని బాలశౌరి.. సెప్టెంబర్ 18, 1968న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, మాచవరం మండలం, మొర్జంపాడు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జోజయ్య నాయుడు-తమసమ్మ. ఆయన ప్రాథమిక విద్య, ఉన్నత విద్య గుంటూర్ లోనే సాగింది. ఆ తరువాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించారు. తన వ్యాపారంలో అంచులంచులుగా ఎదిగారు.ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు భానుమతి.వారికి ముగ్గురు కుమారులు. వల్లభనేని అనుదీప్, వల్లభనేని అరుణ్, వల్లభనేని అఖిల్. ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ గా మంచి పేరు గుర్తింపు ఉంది. 

రాజకీయ జీవితం 

చిన్ననాటి నుండే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుకగా పాల్గొనే వారు. ఈ క్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్రుష్టిని ఆకర్షించారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పైగా వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడుగా మారాడు.  

వల్లభనేని బాలశౌరి 2004లో తెనాలి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అప్పట్లో తెనాలి గుంటూరు కృష్ణాజిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది. కానీ, 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెనాలి నియోజకవర్గం తొలగించబడింది. దీంతో ఆయన తన నియోజకవర్గాన్ని నరసరావుపేటకు మార్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసినా బాలశౌరి ఓటమి పాలయ్యాడు. 

వైసీపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తీరు నచ్చక 2013 అక్టోబరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వల్లభనేని బాలశౌరి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. కానీ,  టిడిపి తరఫున గల్లా జయదేవ్ బరిలో నిలవడంతో ఆయన బలం, బలగం ముందు నిలువలేకపోయాడు. ఇక 2019లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఆయన ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. గుంటూరు జిల్లాలోని తెనాలి, నర్సరావుపేట, గుంటూరు ఇలా మూడు స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసిన రికార్డు బాలశౌరికే దక్కింది.

జనసేనలో చేరిక 

2024 ఎన్నికల్లో చాలామంది ఇన్చార్జిలను ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో మచిలీపట్నం లోక్ సభ స్థానానికి కూడా కొత్త ఇన్చార్జిని నియమించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  2024 జనవరి 13న  వైసీపీకి గుడ్ బై చెప్పారు బాలశౌరీ. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో భేటీ అయి పార్టీ లో చేరారు.  ఇక 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ స్థానం నుండి  టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్ధిగా బాలశౌరిని బరిలోకి దిగారు.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios