ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు..మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పూజలు నిర్వహించారు.


ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు..మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని మారుతీ నగర్ శ్రీసువర్చలా సమేత ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాములకు ఆంజనేయస్వామికి తన తండ్రి డాక్టర్‌ మనోజ్‌తో కలిసి వైష్ణవి పూజలు చేశారు. 

మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని... సీఎంగా బాధ్యతలు చేపట్టాలని తాను ఈ పూజలు నిర్వహించినట్లు ఆమె చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఆంజనేయస్వామికి రూ.10వేలు హుండీలో వేస్తానని వైష్ణవి మొక్కుకుంది. ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ.లక్ష కానుకగా సమర్పించిన విషయం తెలిసిందే.