కర్నూల్:కొత్త సంవత్సరం వేడుకల్లో పాత కక్షలు  పురివిప్పాయి. కత్తులతో దాడికి దిగడంతో ఉపేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కర్నూల్‌ జిల్లా మహానంది మండలంలోని ఈశ్వర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో పాతకక్షలు పురివిప్పాయి. ఎరుకలి ఉపేంద్ర,  రాజశేఖర్, నాగార్జునలపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు.

ఈ ఘటనలో ఎరుకలి ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు.  రాజశేఖర్, నాగార్జునలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రాజశేఖర్, నాగార్జునలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.