చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిపై తాను టీఆర్‌ఎస్‌ తరుపున పోటీచేస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఉపాసన ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ప్రేమిస్తున్నానని సంగీతా రెడ్డి తన బాస్‌ అంటూ చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఒకరు. ఈమె రామ్‌ చరణ్‌ అప్‌డేట్స్‌నే కాకుండా తన వృత్తికి, అపోలో హాస్పిటల్స్‌ కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. 

అయితే ఇటీవల ఓ పత్రికలో ఉపాసన రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారని అంతేకాదు ఏకంగా ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరిపై పోటీ చేస్తున్నారో అని తెలియజేస్తూ ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. ఆ కథనంపై ఆమె స్పందించారు. 

చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిపై తాను టీఆర్‌ఎస్‌ తరుపున పోటీచేస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఉపాసన ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను ప్రేమిస్తున్నానని సంగీతా రెడ్డి తన బాస్‌ అంటూ చెప్పుకొచ్చారు. తన చిన్నాన్న అయిన విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో మంచి పనులు చేస్తున్నారంటూ ప్రశంసించారు ఉపాసన.