నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ కారుపై దాడి చేశారు. ఆదివారం ఆయన అమరావతి వెళ్తుండగా ఆయన కారుపై ఓ గుర్తు తెలియని మహిళ రాళ్లదాడికి పాల్పడ్డారు. వెంటనే రంగంలోకి అప్రమత్తమైన పోలీసులు, ఎమ్మెల్యే గన్ మెన్ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

అయితే దాడి చేసిన మహిళకు మతిస్థిమితం లేనట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే వాహనంతో పాటు మరో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.