అర్థరాత్రి తలుపుకొట్టి తండ్రీకూతుళ్లపై ఇనుపరాడ్ తో దాడిచేశాడో దుండగుడు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. ఈ ఘటనలో గాయపడిన సీతారామయ్య శంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. 

బుధవారం అర్థరాత్రి ఎవరో తలుపు కొట్టడంతో తలుపుతీస్తే.. ముఖానికి రంగుతో ఓ అపరిచితుడు కనిపించాడు. అతను వెంటనే ఇనుపరాడ్ తో  టీచర్ పై దాడి చేశాడు. తండ్రిపై దాడిని అడ్డుకున్న కుమార్తె ధనశ్రీపై కూడా దాడి చేశాడు. ఈ అనుకోని పరిణామాలతో సీతారామయ్య భార్య గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు అక్డకి నుంచి పరారయ్యాడు. 

బాధితులిద్దరూ ప్రస్తుతం పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూమి విషయంలో తగాదా నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.