న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పారని తేలిపోయింది. పార్లమెంటు సాక్షిగా ఆయన చెప్పినవి అబద్ధాలని స్పష్టమైంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ మాట్లాడలేదని తేలింది.

జనవరి 19వ తేదీన వైఎస్ జగన్ అమిత్ షాను కలిశారు. పెరిగిన పోలవరం అంచనాలను ఆణోదించిన జగన్ అమిత్షాను కోరినట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే హోం మంత్రి అమిత్ షాకు అందుకు సంబంధించిన వినపత్రాన్ని జగన్ ఇవ్వలేదని జలశక్తి శాఖ సహాయ మత్రి రతన్ లాల్ పార్లమెంటులో చెప్పారు. 

కేంద్రానికి సమర్పించిన వినపత్రాలను జగన్ తనంత తానుగా పత్రికలకు విడుదల చేయరు. ఆయన ఢిల్లీకి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ పెద్దలను కలిసి మాట్లాడారని ప్రభుత్వం నుంచి ప్రకటనలు విడదులవుతాయి. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనవరి 19వ తేీదన, ఫిబ్రవరి 19వ తేదీన అమిత్ షాను కలిశారని, పోలవరం పెరిగిన వ్యయానికి సంబంధించిన అంచనాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. దానిపై రతన్ లాల్ మాట్లాడారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, జగన్ సైతం మెమొరాండం ఇవ్వలేదని ఆయన చెప్పారు.