కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఈరోజు కడప జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సీఎం రమేష్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఈరోజు కడప జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సీఎం రమేష్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికారుల పనితీరుపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలు అమలు చేయడంలో అధికారుల పనితీరు ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. జిల్లాలో బ్యాల వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రక్తహీనత కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. 

ఆరోగ్య శాఖ సరిగా పని చేయలేదనే విషయం అర్థమౌతోందని అన్నారు. మహిళా పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సరైన రికార్డులు మెయిన్‌టైన్ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితుల స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఎటువంటి లెక్కలు లేవని పేర్కొన్నారు. కడపలో స్వచ్ఛభారత్‌ టాయిలెట్స్ ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పారు. జిల్లాలో హౌసింగ్ స్కీమ్ ఆశాజనకంగా లేని.. ఇప్పటికి ఇళ్ల కేటాయింపుల్లో లోపాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇక, అంతకుముందు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి నారాయణ స్వామికి.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఆ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నారాయణ స్వామి వారితో కొంతసేపు ముచ్చటించారు.