Asianet News TeluguAsianet News Telugu

ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు సహకారం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తిరుమలలో వెంకటేశ్వరస్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు సందర్శించుకొన్నారు.    ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 

union minister Kishan Reddy offers special prayers in Tirumala
Author
Tirumala, First Published Aug 19, 2021, 10:01 AM IST

తిరుమల:  ఎర్ర చందనం స్మగ్గింగ్ ను అరికట్టేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహయపడుతుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గురు వారం నాడు మంత్రి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు.

మంత్రికి టీటీడీ ఛైర్మెన్ వైవీసుబ్బారెడ్డి సహా  ఆలయ అధికారులు ఘనంగా  స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
ఎర్రచందనం స్మగ్లింగ్ అంతర్జాతీయ మాఫియా పాల్పడుతుందన్నారు. ఈ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. 

రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి వేద ఆశీర్వచనాన్ని అందించారు అర్చకులు. అనంతరం ఆయన స్విమ్స్ లో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ భారత్ లో జరుగుతోందని ఆయన చెప్పారు. 

థర్డ్ వేవ్‌పై ఆందోళన వద్దని..నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. త్వరలో 130 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సినేషన్ పూర్తవుతుందని తెలిపారు. దేశంలో వేగంగా వ్యాక్యినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. వ్యాక్సినేషన్‌ను ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 
వకులామాత ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ పూనుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios