అమత్ షా విశాఖ టూర్: ఈ నెల 11కి వాయిదా
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్టణం పర్యటన ఈ నెల 11కి వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 8వ తేదీనే అమిత్ షా విశాఖపట్టనం రావాల్సి ఉంది.
అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖ పట్టణం పర్యటన ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ నెల 8వ తేదీన అమిత్ షా విశాఖపట్టణం టూర్ ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షాకు ఇతర అత్యవసర సమావేశాలున్నందున ఈ నెల 8వ తేదీకి బదులుగా అమిత్ షా టూర్ 11కి వాయిదా పడింది
ఈ నెల 10వ తేదీన తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉంది. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ నెల 3వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ పొత్తులపై చంద్రబాబు, బీజేపీ నేతల మధ్య చర్చ జరిగిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులు కుదురుతాయని సాగిన ప్రచారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు.
దక్షిణాదిలోని తెలంాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డాలు పర్యటన ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.