జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై చర్చ
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు ఫోన్ లో మాట్లాడారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు ఫోన్ లో మాట్లాడారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీం జగన్ తో చర్చించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. సడలింపులు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా సీఎం జగన్ కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఏపీయేనని ఆయన చెప్పారు.
also read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 81 కేసులు, మొత్తం 1097కి చేరిక
రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకొంటున్న చర్యలను గురించి అమిత్ షా కు జగన్ వివరించారు. రాష్ట్రంలో కరోనాను నిరోధించేందుకు రాష్ట్రం అన్ని రకాల చర్యలను తీసుకొంటున్న విషయాన్ని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆసుపత్రులు, వైద్యుల సేవల గురించి అమిత్ షా కు తెలిపారు.
ఆదివారం నాడికి ఏపీ రాష్ట్రంలో 1097కి చేరకొన్నాయి. గత 24 గంటల్లో 81 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. కరోనాను అరికట్టేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు అధికారులతో సమీక్షలు నిర్వహించారు.