వైసీపీ పాలనలో ఏపీలో పెరుగుతున్న దౌర్జన్యకాండ.. : ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్
Amaravati: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో దౌర్జన్యకాండ పెరిగిపోతున్నదని ఏపీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన ఆయన... బీజేపీని సైతం టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
AP BRS chief Dr.Thota Chandrasekhar: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో దౌర్జన్యకాండ పెరిగిపోతున్నదని ఏపీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన ఆయన... బీజేపీని సైతం టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీ నెమ్మదిగా తన విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే పలు పార్టీలకు చెందిన నాయకులు శుక్రవారం ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు ఆలమూరు రఫీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా జోనల్ ఇంచార్జీ నాగుల్ మీరా,షేక్ రబ్బాని సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్చగా బ్రతకలేని దయనీయ పరిస్తితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ.. మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించే బీజేపీని దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు ఈ క్రమంలో బీజేపీని ఎదుర్కొగల ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమై అభివృద్ది కుంటుబడిందని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ పార్టీల మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజానీకం వంచనకు గురైందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రత్యాన్మయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
అనంతరం నాగుల్ మీరా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతూ పబ్బం గడుపుకొంటున్నాయని ఆరోపించారు. ముస్లిం మైనార్టీ వర్గాలపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీ వర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు.