వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉండవల్లి సంచలన కామెంట్స్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 6, Sep 2018, 1:47 PM IST
undavalli sensational comments on ysr
Highlights

రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  సంచలన కామెంట్స్ చేశారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ అవినీతికి పాల్పడలేదని తానెప్పుడైనా చెప్పానా? అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. వైఎస్‌ మనీ టేకింగ్ చేశారన్నారు. కానీ మనీ మేకింగ్ చేయలేదని చెప్పారు. 

రాజా ఆఫ్ కరెప్షన్‌ బుక్‌పై తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ టీడీపీ ప్రతినిధిగా మారారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఈర్ష్య ఉంటే తాను ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తానని వెల్లడించారు. మార్గదర్శిపై త్వరలో మరిన్ని వాస్తవాలు బయటపెడతానని ఉండవల్లి స్పష్టం చేశారు.

loader