Asianet News TeluguAsianet News Telugu

అమరావతికి జగన్ మద్దతు ఇచ్చారు.. లేకుంటే రైతులు ల్యాండ్ ఇచ్చేవాళ్లు కాదు: ఉండవల్లి అరుణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత అమరావతిలో రాజధాని కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.

Undavalli arun kumar key Comments On AP capital issue
Author
First Published Nov 7, 2022, 3:41 PM IST | Last Updated Nov 7, 2022, 3:41 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత అమరావతిలో రాజధాని కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. భ్రమరావతి అని కూడా చెప్పిందే  తానేనని అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు.. వైఎస్ జగన్ ఒప్పుకున్నారని అన్నారు. అమరావతికి జగన్ మద్దతు ఇవ్వకుండా ఉండి ఉంటే రైతులు ల్యాండ్స్ ఇచ్చేవాళ్లు కాదని అన్నారు. క్యాపిటల్ వస్తుందని అనుకుంటే రాకుండా పోయిందనే బాధ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్లకు కచ్చితంగా ఉంటుందన్నారు. 

మూడు రాజధానుల వ్యవహారం కొత్త అంశమని.. ఇదేమవుతందనేది సుప్రీం కోర్టు తేలుస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అంశం మీద ఇప్పుడు కామెంట్ చేయడం సరికాదని చెప్పారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తాను విమర్శించనని.. ఆయన ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదని అన్నారు. తనను గౌరవిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. అయితే సిగ్గులేదా అని పవన్ కల్యణ్‌ను తాను ఎప్పుడూ అనలేదని.. ఆయన వీడియో చూడకుండా ఏదో హెడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటారని అన్నారు. 

ఛిట్ పండ్ కంపెనీ నిర్వహించేవారు ఏ వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉందని ఉండవల్లి అన్నారు. చట్టం తని పని తాను చేస్తుందనేది పచ్చి అబద్దమన్నారు. రామోజీరావుకు మార్గదర్శి ఛిట్ పండ్ కంపెనీకు సంబంధం ఉందా? లేదా? అనేది ప్రభుత్వం నిర్థారించాలన్నారు. రామోజీరావు మార్గదర్శి ఆయనేదేనని ఒకసారి.. కాదని మరోసారి చెబుతున్నారని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. వాటిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.  రామోజీరావుపై ఎలాంటి కేసులు పెట్టినా స్టే తెచ్చుకోగలరు.. ఆయనతో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు కోర్టులో స్టేలు వస్తున్నాయని.. ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాలను న్యాయపరంగా నిరూపించలేకపోతోందన్నారు. చట్టాలకు రామోజీరావు అతీతుడు కాదన్న విషయం జనం తెలుసుకోవాలన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios