జగన్ కాళ్ళు ఎలా బొబ్బలెక్కిపోయాయో !

జగన్ కాళ్ళు ఎలా బొబ్బలెక్కిపోయాయో !

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాళ్లు బొబ్బ‌లు క‌డుతున్నాయి. అరి కాళ్లు, బొట‌న వేళ్లు పుండ్లు అవుతున్నాయి. జ‌నం తాకిడితో కాళ్లు చితికిపోతున్నా లెక్క చేయ‌కుండా బాధ‌ను త‌న‌లోనే దిగ‌మింగుతూ ముందడుగు వేస్తున్నారు. సెక్యూరిటీ ఎంత ఆపుతున్నా జనాలు ఒక్కోసారి తోసుకుని జగన్ మీదకు వచ్చేస్తున్నారు. అటువంటి సమయంలో పలువురు జగన్ కాళ్ళను కూడా తొక్కేస్తున్నారు. అభిమానంతో వస్తున్న జనాలను చూసి జగన్ కూడా ఏమనలేక పోతున్నారు.

తన వద్దకు వస్తున్న అభిమానులను, జనాలనను ఆపవద్దని సెక్యురిటీకి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో సెక్యూరిటీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. పలకరింపుతోనో.. కరచాలనంతోనో, చిరునవ్వుతోనో స్పందిస్తూ జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు మధ్యలో సెల్ఫీలొకటి. ఇప్పటికే కొన్ని వేలమంది మహిళలు, ప్రధానంగా యువత జగన్ తో సెల్ఫీలు దిగారు. పాదయాత్రలో కాళ్ళు సహకరించకున్నా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో మందులు రాసుకుంటూ మళ్ళీ నడకకు సిద్దమవుతున్నారు. అలవాటు లేని వ్యవహారం కావటంతో పాదయాత్రతో జగన్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర సందర్భంగా ఇలాగే అవస్తలు పడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos