ఎక్కడ తమ అక్రమసంబంధం గురించి బయటపడుతుందోనని భయపడి సొంత బాబాయ్ తన ప్రియురాలితో కలిసి ఎనిమిదేళ్ల బాలున్ని అతి కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

చిత్తూరు: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలున్ని వివాహేతర సంబంధం (illict affair) బలితీసుకున్న అమానుషం చిత్తూరు జిల్లా (chittor district)లో బయటపడింది. సమీప బంధువైన మహిళతో ఏకాంతంగా వుండగా చూసాడని సొంత బాబాయే బాలుడిని అతి కిరాతకంగా హతమార్చాడు. అతడి ప్రియురాలు కూడా బాలుడితో అత్యంత క్రూరంగా వ్యవహరించింది. వారంరోజుల క్రితమే ఈ దారుణం చోటుచేసుకోగా తాజాగా బాలుడి హత్య మిస్టరీ వీడి నిందితులిద్దరూ అరెస్టయ్యారు. 

బాలుడి హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన చిత్తూరు జిల్లా కలిగిరి మండలం అద్దవారిపల్లెకు చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు ఉదయ్ కిరణ్ కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కలంతా వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే బాలుడు కనిపించకుండా పోయిన మూడురోజుల తర్వాత అద్దవారిపల్లె శివారులో ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. చెట్టుకు ఉరివేయబడిన స్థితిలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. 

ఇలా బాలుడి మిస్సింగ్ కేసు కాస్తా హత్యకేసుగా మారింది. అయితే అతడిని ఎవరు చంపారన్నది తెలుసుకునేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోవడంతో ఈ దారుణానికి ఎవరు పాల్పడారన్నది తెలుసుకోవడానికి పోలీసులకు సమయంపట్టింది. చాకచక్యంగా ఈ హత్యపై విచారణ జరిపిన పోలీసులు బాలుడి బాబాయే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. 

మిస్సయిన రోజే అంటే మార్చి 11వ తేదీన ఉదయ్ కిరణ్ చూడకూడని దృశ్యాన్నిచూసాడు. బాబాయ్ కలిచెర్ల సహదేవ, అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాజేశ్వరితో ఇంట్లో ఏకాంతంగా వుండగా బాలుడి కంటపడింది. దీంతో తమ అక్రమసంబంధం గురించి ఎక్కడ బయటపడుతుందోనని భయపడిపోయిన ఈ ఇద్దరూ దారుణానికి ఒడిగట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బాలుడిని అతి కిరాతకంగా హతమార్చారు. 

మొదట బాలున్ని పట్టుకున్న రాజేశ్వరి మర్మాంగంపై దాడిచేసింది. దీంతో విలవిల్లాడిపోతూ కిందపడిపోయిన ఉదయ్ కిరణ్ ను టవెల్ తో గొంతు బిగించి చంపేసాడు బాబాయ్ సహదేవ. ఇలా తమ అక్రమబంధం బయటపడకుండా వుండేందుకు అమాయక బాలున్ని క్రూరంగా హతమార్చి అదేరోజు రాత్రి మృతదేహాన్ని గ్రామ శివారులోకి తరలించారు. ఓ చెట్టుకు బాలుడు మృతదేహాన్ని ఉరేసుకున్నట్లుగా వేలాడదీసి తమకేమీ తెలియదన్నట్లుగా నటించసాగారు. 

అయితే పోలీసులకు బాబాయ్ సహదేవ తీరుపై అనుమానం రావడంతో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో సహదేవతో పాటు అతడి ప్రియురాలు రాజేశ్వరి అరెస్ట్ చేసినట్లు మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. బాలుడి హత్యమిస్టరీని చేధించి నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. 

ఇలా వివాహేతర సంబంధాలు జీవితాలను చిద్రం చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. క్షణకాలం శారీరక సుఖం కోసం విచ్చలవిడిగా వ్యవహరించడం ఎన్నో దారుణాలకు దారితీస్తోంది. ఇటీవల ఇలాగే పెళ్లయి ఇద్దరుపిల్లలు పుట్టాక మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చుకుంది. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 గుంటూరు జిల్లా (guntur district) కంతెర గ్రామానికి చెందిన గులకవరపు నరేష్-విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇలా భర్త, ఇద్దరు పిల్లలతో ఆనందంగా సాగుతున్న జీవితాన్ని విజయలక్ష్మి నాశనం చేసుకుంది. సాలూరు గ్రామానికి చెందిన జలసూత్రపు సాయితేజతో ఆమెకు పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరకు అతడి చేతిలోనే దాడికి గురయి ప్రాణాలమీదకు తెచ్చుకుంది.