తెనాలి: మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు వీలుగా గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు వినూత్న నిబంధనను పెట్టారు. ఆధార్ కార్డు, గొడుగుతో మద్యం దుకాణం వద్దకు వస్తేనే మద్యం విక్రయిస్తామని తేల్చి చెప్పారు. 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీ నుండి మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి.దాదాపుగా 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలు ప్రారంభం కావడంతో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మద్యం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా మద్యం ప్రియులు గుమికూడారు. 

మద్యం కోసం పురుషులతో పాటు మహిళలు కూడ వచ్చారు. కొందరైతే తమ భర్తల కోసం మద్యం కొనుగోలు చేస్తే, మరికొందరు తమ కోసమే మద్యం కొనుగోలు చేసినట్టుగా చెప్పారు.

also read:లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరకుండా ఉండేందుకు గాను తెనాలి పోలీసులు వినూత్న నిబంధన పెట్టారు. ఆధార్ కార్డుతో పాటు గొడుగును తీసుకొని మద్యం దుకాణాల వద్ద క్యూలో నిలబడినవారికి మద్యం విక్రయించాలని పోలీసులు మద్యం దుకాణాల యజమానులకు సూచించారు.

గొడుగులు తీసుకొని రావడం ద్వారా క్యూ లైన్లలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య అనివార్యంగా కొంత దూరం పాటించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. దీంతో గొడుగు నిబంధనను తీసుకొచ్చారు.