కేవలం వాటర్ బాటిల్ కోసం ఓ హోటల్ యజమానికి ఇద్దరు యువకులు దాడిచేసిన దారుణం జగ్గయ్యపేట చోటుచేసుకుంది.
జగ్గయ్యపేట : కేవలం పదిరూపాయల వాటర్ బాటిల్ కోసం ఓ వ్యక్తిని చావబాదారు ఇద్దరు దుండగులు. కర్రలతో విచక్షణారహితంగా దుండగులు దాడి చేయడంతో హోటల్ యజమాని తల పగిలి రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ దుర్ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో చోటుచేసుకుంది.
జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట క్రాస్ రోడ్డులోని వైన్ షాప్ వద్ద భార్యభర్తలు హోటల్ నిర్వహిస్తున్నారు. వైన్ షాప్ లో మద్యం తీసుకునేవారు వాటర్ బాటిల్స్, ఆహార పదర్ధాలు ఈ హోటల్లో తీసుకుంటుంటారు. ఇలా ఇవాళ(గురువారం) కూడా ఓ ఇద్దరు వ్యక్తులు వైన్ షాప్ పక్కనున్న ఈ హోటల్ కు వెళ్లారు. ఓ వాటర్ బాటిల్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోడానికి ప్రయత్నించగా మహిళ వారిని అడ్డుకుంది. డబ్బులిచ్చి వెళ్లాలని నిలదీయగా ఆగ్రహించిన ఆ ఇద్దరు నోటికొచ్చినట్ల తిడుతూ చేయిచేసుకున్నారు.
వీడియో
భార్యతో గొడవపడుతున్న వారిని అడ్డుకోడానికి హోటల్ యజమాని ప్రయత్నించగా అతడిపైనా దాడికి దిగారు. ఇద్దరు దుండగులు కర్రలతో కొట్టడంతో తలపగిలి తీవ్ర రక్తస్రావంతో అతడు స్పృహతప్పి అక్కడే పడిపోయాడు. దీంతో గ్రామస్తులు దుండగులను అడ్డుకుని హోటల్ యజమానికి జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడికి సమయానికి మెరుగైన చికిత్స అందడంతో ప్రాణాలు దక్కాయని డాక్టర్లు చెబుతున్నారు.
Read Moreజూపార్క్ లో విషాదం.. బ్యాటరీ వాహనం ఢీ కొని మూడేళ్ల బాలుడు మృతి...
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ యజమానికపై దాడిచేసిన దుండగులకు గుర్తించేందుకు వైన్ షాప్ తో పాటు చుట్టుపక్కల సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.కేవలం వాటర్ బాటిల్ డబ్బులకోసమే ఈ దాడి చేసారా లేక మరెదైనా కారణముందో తెలియాల్సి వుంది.
