బ్యాడ్ న్యూస్: నెల్లూరు ఎయిర్ పోర్ట్ అగ్రిమెంట్ క్యాన్సల్

నెల్లూరు వాసులకు ఒక చేదు వార్త. నెల్లూరు పక్కనున్న దగదర్తి వద్ద నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ ని ప్రభుత్వం రద్దు చేసింది.

Two years after pact was signed, Andhra Pradesh terminates agreement for Nellore airport at Dagadarthi

నెల్లూరు వాసులకు ఒక చేదు వార్త. నెల్లూరు పక్కనున్న దగదర్తి వద్ద నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ ని ప్రభుత్వం రద్దు చేసింది. రెండు సంవత్సరాలయినా అక్కడ నిర్మాణం చేపట్టకపోవడంతో రద్దు చేసారు. 

2018 జూన్ లో ఈ విమానష్రయం నిర్మాణానికి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ ను రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ , నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ల సంయుక్త స్పెషల్ పర్పస్ వెహికల్ ఈ కన్సెషన్ ఒప్పందం మీద సంతకం పెట్టింది. 

1352 ఎకరాల్లో, 368 కోట్ల వ్యయంతో  1.9 మిలియన్ మంది ప్రయాణికులను, 55 వేల మెట్రిక్ టన్నుల కార్గోను సంవత్సరానికి హ్యాండిల్ చేసే సామర్థ్యంతో దీనిని నిర్మించతలపెట్టారు. 3,150 మీటర్ల పొడవైన రన్ వే ఇక్కడ దిగే భారీ విమానాలకు అనువుగా నిర్మించాలనుకున్నారు. 

నెల్లూరు జిల్లాలో పర్యాటక, వాణిజ్య రంగాలకు ఊతం కలిగిస్తుంది ఈ ఎయిర్ పోర్ట్ అని అంతా భావించారు. కానీ అది జరగలేదు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడు 2020 జనవరి నాటికి ఇక్కడ విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చింది లేదు. 

సైట్ ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేకపోవడం వల్లనే పూర్తిచేయలేకపోయానని డెవలపర్ చెబుతున్నాడు. మినహాయింపులు లేనందువల్ల భూములివ్వడానికి రైతులు కూడా ముందుకు రావడంలేదని తెలియవస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పని కాదని కమిటీ జూన్ 17వ తేదీన ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios